Mfine APP: ఇకపై రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను స్మార్ట్‌ ఫోన్‌తో తెలుసుకోవచ్చు.. సరికొత్త యాప్‌ సృష్టించిన..

|

Apr 09, 2021 | 12:19 PM

Mfine APP: కరోనా కారణంగా ప్రజల్లో ఆరోగ్యంపై ఆసక్తి బాగా పెరగింది. కరోనా వైరస్‌ శ్వాససంబంధిత వ్యవస్థతో పాటు మొత్తం మానవ శరీరంపై దుష్ప్రభావం చూపిస్తుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..

Mfine APP: ఇకపై రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను స్మార్ట్‌ ఫోన్‌తో తెలుసుకోవచ్చు.. సరికొత్త యాప్‌ సృష్టించిన..
Mi Fine App
Follow us on

Mfine APP: కరోనా కారణంగా ప్రజల్లో ఆరోగ్యంపై ఆసక్తి బాగా పెరగింది. కరోనా వైరస్‌ శ్వాససంబంధిత వ్యవస్థతో పాటు మొత్తం మానవ శరీరంపై దుష్ప్రభావం చూపిస్తుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా బారిన పడిన వారిలో రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు కూడా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. దీంతో ఎప్పటికప్పుడు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను పరీక్షించుకుంటూ చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి.
మరి రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకోవడానికి ఉపయోగపడే పరికరాలను కొనుగోలు చేయాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. అలా కాకుండా కేవలం మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తోనే ఆక్సిజన్‌ స్థాయిలు తెలుసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! దీనిని నిజం చేసి చూపించింది డిజిటల్‌ హెల్త్‌ స్టార్టప్‌ ఎంఫైన్‌. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను స్మార్ట్‌ఫోన్‌తోనే తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ సహాయంతో స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే బ్యాక్‌ కెమెరా, ఫ్లాష్‌ సహాయంతో ఆక్సిజన్‌ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో పనిచేసే ఈ యాప్‌.. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ముందుగా Mfine యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం మెజర్‌ యువర్‌ బ్లడ్‌ ఆక్సీజన్‌ లెవల్స్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత వేలితో ఫోన్‌ బ్యాక్‌ కెమెరాపై వేళు పెట్టాలి. అలా 20 సెకండ్లపాటు ఉంచితే మీ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలో ఎలా ఉన్నాయో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. ఇక భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా ఇలాంటి మరెన్నో సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంఫైన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

Also Read: Pearl Farming: సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!

Gunnies Record: దాదాపు ఆరువేల కిలోమీటర్లు.. 13 రోజుల్లో సైకిల్ పై చుట్టేసిన ఆర్మ్ అధికారి..రెండు గిన్నీస్ రికార్డులు సొంతం!

YS Sharmila convoy accident : షర్మిల కాన్వాయ్ లో ప్రమాదం, నాలుగు వాహనాలు ఢీ కొని పలువురికి గాయాలు.!