
ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకీ మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటడానికి పలువురు ప్రముఖులు ఉత్సాహం చూపుతున్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది.
తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబిలీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ అండ్ జూబ్లిహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ల ఆధ్వర్యంలో.. జూబ్లీహిల్స్ క్లబ్ ప్రాంగణంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లరి నరేష్ డైరెక్టర్లు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి, వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.