లాక్‌డౌన్‌ వేళ.. ఢిల్లీ- గుర్గావ్ హైవే‌పై భారీ ట్రాఫిక్‌ జాం..

| Edited By:

May 29, 2020 | 3:06 PM

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోందన్న విషయం తెలిసిందే. అయితే నాలుగో విడత లాక్‌డౌన్ విధించిన సమయంలో కాస్త సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి.. అనేక పట్టణాల్లో ట్రాఫిక్ మళ్లీ పెరిగిపోయింది. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఢిల్లీ-గుర్గావ్‌ జాతీయ రహదారిపై శుక్రవారం పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అయితే ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడానికి అసలు కారణం ఎంటో […]

లాక్‌డౌన్‌ వేళ.. ఢిల్లీ- గుర్గావ్ హైవే‌పై భారీ ట్రాఫిక్‌ జాం..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోందన్న విషయం తెలిసిందే. అయితే నాలుగో విడత లాక్‌డౌన్ విధించిన సమయంలో కాస్త సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి.. అనేక పట్టణాల్లో ట్రాఫిక్ మళ్లీ పెరిగిపోయింది. తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఢిల్లీ-గుర్గావ్‌ జాతీయ రహదారిపై శుక్రవారం పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. అయితే ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడానికి అసలు కారణం ఎంటో అధికారులు చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో హర్యానా నుంచి న్యూఢిల్లీ వెళ్లే దారులన్నింటిని మూసేయాలని.. హర్యానా సర్కార్‌ నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ట్రాఫిక్ జాం తలెత్తిందని అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి హర్యానాకు రాకపోకలు పెరగడంతోనే కరోనా కేసులు పెరిగాయంటూ హర్యానా హోంమంత్రి ఆరోపించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ-హర్యానా మధ్య మార్గాలను మూసేయాలని నిర్ణయించినట్లు సమాచారం.