దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కరోనా కలకలం రేపింది. రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేరే ఇంకెవరికైనా వైరస్ సోకుతుందన్న భయంతో కార్యాలయాన్ని పారిశుద్ధ్య సిబ్బంది శానిటేషన్ చేశారు.
మరోవైపు కరోనా సోకిన వ్యక్తి కుటుంబంలో మరో ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు వారిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారితో సన్నిహితంగా మెలిగిన వారు ఎవరెవరనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు వారందరినీ ఇంటి వద్దే ఉండాలని సూచించారు. తాజాగా వైరస్ సోకిన వ్యక్తితో కలిపి తెలంగాణ భవన్‌లో మొత్తం ముగ్గురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.