కరోనా కాటుతో మహారాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ మృతి

కరోనా మహమ్మారి బారినపడి మహారాష్ట్రకు చెందిన మాజీ ఎన్నికల కమిషనర్, మరాఠీ రచయిత్రీ నీల సత్యనారాయణ మరణించారు. గత కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఈస్ట్ అంధేరీ, మరోల్ ప్రాంతలోని..

కరోనా కాటుతో మహారాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ మృతి

Edited By:

Updated on: Jul 17, 2020 | 6:39 AM

కరోనా మహమ్మారి బారినపడి మహారాష్ట్రకు చెందిన మాజీ ఎన్నికల కమిషనర్, మరాఠీ రచయిత్రీ నీల సత్యనారాయణ మరణించారు. గత కొద్ది రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఈస్ట్ అంధేరీ, మరోల్ ప్రాంతలోని సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆమె చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి మరణించారు. ఆమె మహారాష్ట్రకు తొలి మహిళా ఎన్నికల కమిషనర్‌గా పనిచేశారు. ఆమె మరణించిన వార్తను విన్న గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ సంతాపం తెలిపారు. ఓ నిబద్దత గల అధికారిని, సామాజిక స్పృహ కలిగిన మంచి వ్యక్తిని సమాజం కోల్పోయిందని గవర్నర్ అన్నారు.