COVID-19: ఆ రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిత్యం 500లకు పైగా మరణాలు..

|

May 19, 2021 | 10:49 PM

Coronavirus cases in Maharashtra: భారత్‌లో కరోనాసెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, నాలుగు వేలకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు

COVID-19: ఆ రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిత్యం 500లకు పైగా మరణాలు..
Maharashtra Corona
Follow us on

Coronavirus cases in Maharashtra: భారత్‌లో కరోనాసెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు, నాలుగు వేలకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో అంతటా భయాందోళన నెలకొంది. కాగా.. దేశంలో కరోనా ప్రారంభం నాటినుంచి కేసులు, మరణాల పరంగా మొదటిస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో మహమ్మారి ఉదృతి తగ్గుముఖం పట్టెలా కనిపించడం లేదు. ఇటీవల తగ్గిన కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతున్నాయి.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 34,031 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 594 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాలతో మొత్తం కేసుల సంఖ్య 54,67,537 కి పెరగగా.. మరణాల సంఖ్య 84,371 కి చేరింది. ఈ మేరకు మహరాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. కరోనా నుంచి 51,457 మంది కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 49,78,93 కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,01,695 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 91.06 శాతంగా ఉంది. కాగా రాష్ట్రంలో అత్యధికంగా పూనే జిల్లాలో 4,557 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకొని నియంత్రణకు కృషిచేస్తోంది.

Also Read:

Corona AP: ఏపీని వదలని కరోనా రక్కసి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

Vaccination: వ్యాక్సిన్ మొదటి డోసు తరువాత కూడా పాజిటివ్ వస్తుందా? వస్తే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?