మహారాష్ట్రలో 6.15 లక్షలకు చేరిన పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,119 కరోనా పాజిటివ్ కేసులు..

మహారాష్ట్రలో 6.15 లక్షలకు చేరిన పాజిటివ్ కేసులు

Updated on: Aug 18, 2020 | 9:43 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,119 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,15,477కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 4.37 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.56 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 422 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 20,687 మంది మరణించారు. కాగా, రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా ముంబై, థానే,పూణె నగరాల్లోనే నమోదవుతున్నాయి.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us