48 గంటల్లో 278 మంది పోలీసు సిబ్బందికి కరోనా

కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వదలడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు భయబ్రాంతులకు గురవుతున్నాయి. తాజాగా..

48 గంటల్లో 278 మంది పోలీసు సిబ్బందికి కరోనా

Updated on: Jul 08, 2020 | 5:53 PM

కరోనా మహమ్మారి మహారాష్ట్ర పోలీసులను వదలడం లేదు. నిత్యం పదుల సంఖ్యలో సిబ్బంది కరోనా బారినపడుతున్నారు. దీంతో వారి కుటుంబాలు భయబ్రాంతులకు గురవుతున్నాయి. తాజాగా గడిచిన 48 గంటల్లో 278 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. గడిచిన 48 గంటల్లో కరోనా బారినపడి ఓ సిబ్బంది కూడా మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన పోలీస్ సిబ్బంది సంఖ్య 71కి చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,113 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా, దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. అందులో ముంబై నగరంలో అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us