Coronavirus: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

|

Mar 29, 2021 | 11:25 PM

Maharashtra COVID-19 cases: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అన్నిచోట్లా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సైతం అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ సైతం

Coronavirus: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

Maharashtra COVID-19 cases: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అన్నిచోట్లా ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సైతం అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ సైతం విధిస్తున్నప్పటికీ.. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 31,643 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 102 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,45,518 కి చేరగా.. మరణించిన వారి సంఖ్య 54,283 కి పెరిగింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 20,854 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 23,53,307 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,36,584 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కరోనా నిబంధనలు పాటించకపోతే.. కఠినమైన లాక్డౌన్‌ను అమలు చేయక తప్పదని హెచ్చరించారు. ప్రజలంతా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి.

ఇదిలాఉంటే.. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో దాదాపు 84 శాతం ఎనిమిది రాష్ట్రాలకు చెందినవేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత 24 నాలుగు గంటల్లో నమోదైన 68 వేల కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 40 వేలకు కేసులు వెలుగులోకి వచ్చాయని వెల్లడించింది. దీంతోపాటు కర్ణాటకలో 3,082 కేసులు, పంజాబ్‌లో 2,870 కేసులు, మధ్యప్రదేశ్‌లో 2,276 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతోపాటు గుజరాత్, కేరళ, తమిళనాడు, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని.. ఈ ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య బాగా పెరుగుతోందని తెలిపింది.

Also Read: