కరోనాను జయించిన మంత్రి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..!

| Edited By:

Jun 04, 2020 | 5:33 PM

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్ కరోనాను జయించారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కరోనాను జయించిన మంత్రి.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్..!
Follow us on

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పీడబ్ల్యూడీ మంత్రి అశోక్ చవాన్ కరోనాను జయించారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన మంత్రి తాను కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. అయితే మరికొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు వెల్లడించారు.

కాగా గత నెల 24న ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అవ్వగా.. వెంటనే ముంబయిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన ఆయన తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. కాగా మహారాష్ట్రలో కరోనా సోకిన మంత్రుల్లో అశోక్‌ చవాన్ ఒకరు. ఆయనకు ముందు హౌసింగ్ మినిస్టర్ జితేంద్ర అవ్‌హద్‌కు వైరస్ సోకగా.. ఆయన ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా కరోనా బారిన పడగా.. వారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర కేబినెట్ ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది. ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేబినెట్ మీటింగ్‌లను ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారు.

Read This Story Also: కరోనా వైరస్.. తెలుగు రాష్ట్రాల్లో ‘సామాజిక వ్యాప్తి’ కేసులు పెరుగుతున్నాయా..!