
కరోనా మహమ్మారి నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోలుకున్నారు. తాజాగా చేసిన కోవిడ్ 19 పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అలాగే తనకు వైద్యసేవలు అందించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌లో తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు రేపటి వరకూ ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్లో సీఎం శివరాజ్ రాసుకొచ్చారు. కాగా సీఎం శివరాజ్ సింగ్‌కు నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు వైద్యులు. అలాగే మధ్య ప్రదేశ్ సీఎం ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు కూడా పేర్కొన్నారు.
కాగా జులై 25న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. వైద్యుల సూచన మేరకు ఆయన భోపాల్‌లోని చిరయు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే మధ్యలో ఓ సారి ఆయనకు కరోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో మళ్లీ సీఎం ఆస్పత్రిలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. అలాగే ఆయన ప్లాస్మా దానం కూడా చేస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే.
Madhya Pradesh CM Shivraj Singh Chouhan tests negative for #COVID19. pic.twitter.com/2zB0Y2oAkM
— ANI (@ANI) August 11, 2020
Read More:
‘కరోనా’ అనుభవాలు మనకు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్
క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం! మరో ఆస్పత్రికి తరలింపు