కరోనా పేషెంట్‌కి ఊపిరితిత్తుల మార్పిడి.. ఆపరేషన్ సక్సెస్..

| Edited By:

Jun 12, 2020 | 10:54 AM

అమెరికాలో అరుదైన ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. కరోనా వైరస్ బారిన పడిన ఓ 20 ఏళ్ల యువతికి రెండు ఊపరితిత్తులను మార్చారు. భారత సంతతికి చెందిన అంకిత్ భరత్ అనే వైద్యుడు ఈ ఆపరేషన్‌కి నేతృత్వం వహించారు. కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక అమెరికాలో ఇలాంటి ఆపరేషన్...

కరోనా పేషెంట్‌కి ఊపిరితిత్తుల మార్పిడి.. ఆపరేషన్ సక్సెస్..
Follow us on

అమెరికాలో అరుదైన ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. కరోనా వైరస్ బారిన పడిన ఓ 20 ఏళ్ల యువతికి రెండు ఊపరితిత్తులను మార్చారు. భారత సంతతికి చెందిన అంకిత్ భరత్ అనే వైద్యుడు ఈ ఆపరేషన్‌కి నేతృత్వం వహించారు. కరోనా మహమ్మారి ప్రారంభమయ్యాక అమెరికాలో ఇలాంటి ఆపరేషన్‌ నిర్వహించడం ఇదే మొదటిసారి. కాగా షికాగోలోని నార్త్ వెస్ట్రన్‌ మెడిసన్ ఆస్పత్రిలో ఈ శస్త్ర చికిత్స జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. అమెరికాకి చెందిన ఓ 20 ఏళ్ల యువతికి.. ఇటీవలే ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలోనే ఆమెకు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో రెండు ఊపిరితిత్తులూ పాడైపోయాయి. కరోనా వైరస్ తీవ్రంగా ఉండటం వల్ల ఆరు వారాల పాటు వెంటిలేటర్, ఎక్మోపై ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమెకు రెండు ఊపిరితిత్తులు మార్చాల్సిన అవసరం ఏర్పడింది. కాగా ఈ ఆపరేషన్‌ను 42 గంటల్లోనే నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ శస్త్ర చికిత్స చేయాలంటే కరోనా పేషెంట్‌కి కోవిడ్ నెగిటివ్ రావాలి. కాగా ప్రపంచంలోనే తొలిసారిగా గత నెల 26న ఆస్ట్రియాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ జరిగినట్లు డాక్టర్ అంకిత్ భరత్ పేర్కొన్నారు.