క‌రోనా పై పోరులో స‌చిన్ ఉదార‌త‌…

క‌రోనా పై పోరులో స‌చిన్ ఉదార‌త‌...
Photo : ICC

కోవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో తాను సైతం అంటూ స‌చిన్ ముందుకు క‌దిలాడు. క‌రోనా కట్టడికి 50లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన సచిన్‌... తాజాగా ...

Jyothi Gadda

|

Apr 12, 2020 | 11:35 AM

క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు విరాళాలు వెలువెత్తుతున్నాయి. ప్ర‌ముఖులు, రాజ‌కీయ వేత్త‌లు, సినిమా, స్పోర్ట్స్ సెల‌బ్రిటీలు చాలా మంది త‌మ‌కు తోచిన సాహ‌యం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భారత క్రికెట్‌ దేవుడు, బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ మ‌రోసారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. 

కోవిడ్‌పై చేస్తున్న యుద్ధంలో తాను సైతం అంటూ స‌చిన్ ముందుకు క‌దిలాడు. క‌రోనా కట్టడికి 50లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిన సచిన్‌… తాజాగా 5వేలమంది నిరుపేద‌ల‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. అప్నాలయ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు అంగీకరిం చాడు. ఈ విషయాన్ని అప్నాలయ ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. నెలకు 5వేలమందికి సరిపడే రేషన్‌ సచిన్‌ సమకూర్చనున్నాడని ట్వీట్‌లో వెల్లడించింది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సచిన్‌ ట్వీట్‌ చేశాడు. అప్నాలయ తమ సేవల్ని ఇదేవిధంగా ఇకముందు కొనసాగించాలని ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొ వాలని సచిన్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా కోల్‌కతాలోని ఇస్కాన్‌ సంస్థ ద్వారా 10వేలమందికి ఆహారాన్ని అందిస్తున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu