బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..

| Edited By:

May 22, 2020 | 9:30 AM

జూన్ 1 నుంచి అదనంగా 100 రైళ్లు ప్రయాణించనున్నట్లు ఇటీవలే రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు.. నకిలీ ఐడీలను ఉపయోగించి..

బ్లాక్‌లో రైల్వే టికెట్ల అమ్మకం.. ఆరు లక్షల విలువైన టికెట్లను..
Follow us on

సాధారణంగా లిక్కర్ లేదా గంధపు చక్కలు వంటి ఇతరత్రా వాటిని అక్రమంగా తరలించడం లేదా అమ్మడం తెలిసిన విషయమే. కానీ రైల్వే టికెట్లను కూడా అక్రమంగా అమ్మడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోన్న విషయం. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఎనిమిది ఐఆర్‌సిటీసీ ఏజెంట్లతో సహా 14 మందిని.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఏకంగా వారి నుంచి రూ. 6,36,727 విలువైన టికెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్‌ కారణంగా గత కొద్ది రోజులుగా అన్నీ బంద్‌ అయిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంలో.. ఇప్పుడిప్పుడే అన్నీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జూన్ 1 నుంచి అదనంగా 100 రైళ్లు ప్రయాణించనున్నట్లు ఇటీవలే రైల్వేశాఖ ప్రకటించింది. అయితే ఇదే సమయాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు.. నకిలీ ఐడీలను ఉపయోగించి అక్రమంగా టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. ఆ టికెట్లను బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వార్త కాస్తా అధికారులకు చేరడంతో.. ఎనిమిది ఐఆర్‌సిటీసీ ఏజెంట్లను, మరో 14 మందిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా వారి నుంచి రూ. 6,36,727 విలువైన టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఈ ఘటనపై రైల్వేశాఖ స్పందించింది. టికెట్ల విక్రయంలో అక్రమాలకు పాల్పడినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఏజెంట్లపై ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు విజ్జప్తి చేశారు.

ఇది కూడా చదవండి: 

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫీజుల తగ్గింపు విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..