
వచ్ఛే జులై నుంచి విచారణలను ఓపెన్ కోర్టులో పునరుధ్దరించాలని కోరుతూ.. సుప్రీంకోర్టు అడ్వొకేట్లు…. సీజేఐ ఎస్.ఎ, బాబ్డే కి లేఖ రాశారు. కరోనా వంటి ఈ క్లిష్ట సమయంలోనూ న్యాయ ప్రక్రియ కొనసాగేలా చూడడంలో అత్యున్నత న్యాయస్థానం చురుకైన పాత్ర పోషించిందని సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ ఎం. జాదవ్ ఈ లేఖలో పేర్కొన్నారు. అలాగే నూతన ఈ-ఫైలింగ్ మోడ్యూల్ సాఫ్ట్ వేర్ ప్రొవిజన్ ని తెచ్చినందుకు ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.
అయితే ఈ కరోనా సమయంలో చాలామంది లాయర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. దాదాపు 95 శాతం మంది అడ్వొకేట్లు వర్చువల్ కోర్టు విచారణలకు సుముఖంగా లేరని, ఈ మీడియంలో తమ కేసులను వారు సమర్థంగా ప్రెజెంట్ చేయలేకపోతున్నారని అన్నారు. పైగా అందరు అడ్వొకేట్లకూ తమ వాదనలు వినిపించే అవకాశం లభించడం లేదని, ఒక్కో సారి కో-ఆర్డినేటర్ మైక్స్ ని ‘మ్యూట్’ చేయడంవల్ల వారు లేకుండానే తదనంతర విచారణలు జరుగుతున్నాయని జాదవ్ అన్నారు. వర్చ్యువల్ కోర్టు విచారణలు ఓపెన్ కోర్టు హియరింగులకు ప్రత్యామ్నాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ ద్వారా కేసులు దాఖలు చేసేందుకు లాయర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. విచారణల సందర్భంగా ఆడియో-వీడియోల క్వాలిటీ సరిగా లేనందువల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైగా అడ్వొకేట్లలో చాలామందికి కంప్యూటర్ వినియోగానికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోవడం కూడా మరో ఇబ్బంది అవుతోంది అని జాదవ్ వివరించారు. ఈ కరోనా ఎపిడమిక్ సమయంలో కోర్టులు సరిగా పని చేయని కారణంగా గత మూడు నెలలుగా అనేకమంది లాయర్లు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూవచ్చారు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. కోర్టు మళ్ళీ ఇదివరకు మాదిరే విచారణలను పునరుధ్దరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.