కేరళలో పెరుగుతున్న కేసులు.. తాజాగా మరో 108..

కరోనా విముక్త రాష్ట్రంగా మారుతుందనుకున్న వేళ.. కేరళలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. శనివారం నాడు తాజాగా మరో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కేరళలో పెరుగుతున్న కేసులు.. తాజాగా మరో 108..

Updated on: Jun 06, 2020 | 10:35 PM

కరోనా విముక్త రాష్ట్రంగా మారుతుందనుకున్న వేళ.. కేరళలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. శనివారం నాడు తాజాగా మరో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1700 దాటింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,029 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేరళ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక శనివారం నాడు మలప్పురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనా బారినపడి మరణించారని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. ఇదిలావుంటే.. శుక్రవారం నాడు కూడా వందకు పైగా కేసులు నమోదవ్వడంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 762 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Loading...
Unable to load recommendations.
Follow Us