COVID-19 Confirmed: ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్.. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్..

|

Apr 08, 2021 | 7:54 PM

COVID-19: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎం విజయన్ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని..

COVID-19 Confirmed: ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్..  సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానంటూ ట్వీట్..
Follow us on

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎం విజయన్ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నానంటూ పేర్కొన్నారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నారు.

అయితే.. కేరళలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. బహిరంగ ప్రదేశాలు, వర్క్‌ ప్లేసెస్‌లో మాస్క్‌ తప్పనిసరి చేసింది. అయితే ఈ రాష్ట్ర ప్రజలు పెద్దగా పట్టించుకున్న ధాకలులు ఉన్నట్లుగా లేదు. ఎందుకంటే కేరళలో ఇంత వరకు కోవిడ్‌ రక్కసికి బ్రేక్ పడలేదు. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధించింది. ర్యాలీలు, యాత్రలను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. పండుగలపై కూడా ఆంక్షలు విధించింది. వేడుకల్లో గూమిగూడొద్దని సూచించింది. అయినప్పటికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున్న జనం ప్రచార పర్వంలో పాల్గొన్నారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేరళ సీఎం విజయన్ విస్తృతంగా ప్రచార పర్వంలో పాల్గొన్నారు. అదే సమయంలో సీఎం విజయన్ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు పినరయి విజయన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం కోసం పట్టణం మొదలుకుని పల్లెలు తిరిగారు. విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార గడువు ముగిసిన తర్వాతి రోజు అంటే ఏప్రిల్‌ 3వ తేదీన వ్యాక్సిన్‌ పొందారు. తెల్లారి నాలుగో తేదీన ఎన్నికలు జరగ్గా ముఖ్యమంత్రి పినరయి ఓటేశారు.

తాజాగా కరోనా పాజిటివ్‌ తేలింది. ఎలాంటి లక్షణాలు లేవని.. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం ఇచ్చారు. ఇంట్లోనే స్వీయ నిర్బంధం అయ్యారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఆయనకు కరోనా వ్యాపించి ఉంటుందని చర్చ నడుస్తోంది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో ఏప్రిల్‌ 3వ తేదీన ఎన్నికలు జరిగాయి. మే 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక్కడ బీజేపీ- ఎల్డీఎఫ్ మధ్య నెక్ టు నెక్ పోటీ జరిగింది. ఫలితాలు వస్తే కాని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు.

ఇవి కూడా చదవండి : Alert Wi-Fi: పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా..? వాడుకుని బ్యాకింగ్ ట్రాన్సక్షన్స్ చేస్తున్నారా? అయితే బీ అలర్ట్..!

ఇవి కూడా చదవండి : Telangana Governor : కొండరెడ్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన గవర్నర్‌ తమిళి సై.. ఎందుకో తెలుసా..?

Tiger Woods car accident: టైగర్‌వుడ్స్‌ కారు ప్రమాదానికి కారణం ఏంటో తెలుసా.? అసలు విషయం వెల్లడించిన పోలీసులు..