కరోనాతో చనిపోతే ఇంత ఘోరంగా పూడ్చుతారా..?

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను అనాధలను చేస్తోంది. చివరకు మరణించిన వారికి అందరూ ఉండి కూడా అనాధ శవంలా.. అతి దారుణంగా పూడ్చబడుతున్నారు.

కరోనాతో చనిపోతే ఇంత ఘోరంగా పూడ్చుతారా..?

Edited By:

Updated on: Jun 30, 2020 | 8:26 PM

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను అనాధలను చేస్తోంది. చివరకు మరణించిన వారికి అందరూ ఉండి కూడా అనాధ శవంలా.. అతి దారుణంగా పూడ్చబడుతున్నారు. తాజాగా కర్నాటకలో జరిగిన ఉదంతం ఇందుకు అద్దం పడుతోంది. గోతుల్లో శవాలను విసిరేస్తూ.. పూడ్చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బళ్లారిలో బయటపడింది. దీనికి కర్నాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కొందరు వ్యక్తులు పీపీఈ కిట్లను ధరించి.. కరోనా సోకి మరణించిన వారి డెడ్ బాడీలను ఓ గుంతలో విసిరేసి పూడ్చేశారు. అయితే మృతదేహాలను ఇష్టం వచ్చినట్లు నిర్లక్ష్యంగా పడేయడంపై పెను దుమారం రేగింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీనిపై బళ్లారి డిప్యూటీ కమిషనర్ స్పందించారు. కరోనా బారినపడి ఎనిమిది మంది మరణించారని.. వారిని రూల్స్ ప్రకారం బ్యాగుల్లో ఉంచి ఖననం చేశామన్నారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విచారం వ్యక్తం చేస్తున్నామని.. దీనిపై దర్యాప్తు చేపడుతున్నామని వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు.