కర్ణాటకలో తాజాగా మరో 7,665 పాజిటివ్ కేసులు

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో..

కర్ణాటకలో తాజాగా మరో 7,665 పాజిటివ్ కేసులు

Updated on: Aug 18, 2020 | 11:16 PM

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,948కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని
1,56,949 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 79,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 4,201 మంది మరణించారు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా
బెంగళూరు అర్బన్‌లోనే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బెంగళూరు అర్బన్‌లో 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు

Loading...
Unable to load recommendations.
Follow Us