కర్ణాటకలో రికార్డు స్థాయిలో నమోదైన కేసులు

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంత కలకలం రేపుతోంది. తాజాగా..

కర్ణాటకలో రికార్డు స్థాయిలో నమోదైన కేసులు

Updated on: Jul 19, 2020 | 11:35 PM

కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా రోజుకు మూడు వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంత కలకలం రేపుతోంది. తాజాగా ఆదివారం నాడు కొత్తగా మరో 4,120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,772కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 39,370 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 1331 మంది కరోనా బారినపడి మరణించారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా బెంగళూరు నగరంలోనే నమోదవుతున్నాయి. ఆదివారం నాడు బెంగళూరు నగరంలో 2,156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us