Karnataka: నూతన సంవత్సర వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. పార్టీలు, సామూహిక వేడుకలపై నిషేధం!

|

Dec 21, 2021 | 6:07 PM

New Year Celebrations: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. వైరస్ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్ రూపంలో వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Karnataka: నూతన సంవత్సర వేడుకలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. పార్టీలు, సామూహిక వేడుకలపై నిషేధం!
Karnataka Govt
Follow us on

Karnataka govt. issues covid 19 Restrictions: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. వైరస్ కొత్త ఒమిక్రాన్‌ వేరియంట్ రూపంలో వ్యాప్తి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు ఎలాంటి బహిరంగ పార్టీలు, సామూహిక వేడుకలపై నిషేధం విధంచింది. ముఖ్యంగా పబ్‌లు ,రెస్టారంట్లు, అపార్ట్‌మెంట్లలో డీజేల వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మంగళవారం కీలక ప్రకటన చేశారు.

‘‘కొవిడ్‌, ఒమిక్రాన్‌ వేరియంట్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై ఇవాళ నిపుణులతో సమావేశం నిర్వహించామన్న సీఎం.. వారి సిఫార్సుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నామన్నారు. డిసెంబరు 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాల్లో సామూహిక కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నాం. పబ్‌లు, రెస్టారంట్లలో 50శాతం సామర్థ్యంతో న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించుకోవచ్చు. అయితే, అక్కడ డీజేలతో పార్టీలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చేదన్నారు. ఇక రెండు డోసుల టీకా తీసుకోనివారిని పబ్బులు, రెస్టారంట్లలోకి అనుమతించకూడదు. అదే విధంగా, అపార్ట్‌మెంట్లలోనూ డీజేలను నిషేధిస్తున్నాం’’ అని సీఎం బొమ్మై పేర్కొన్నారు. అదేవిధంగా అపార్ట్‌మెంట్లలో కూడా పార్టీలు, డీజేలు ఉండవని, నిబంధనలను ఉల్లంఘించకుండా రెసిడెంట్స్ అసోసియేషన్లు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఆంక్షలు డిసెంబర్ 30 నుండి అమలులోకి వస్తాయి. జనవరి 2 వరకు అమలులో ఉంటాయి. కోవిడ్ 19 కి వ్యతిరేకంగా పూర్తి టీకాలు వేయడం తప్పనిసరి అని కర్ణాటక సిఎం చెప్పారు.

కర్ణాటకలో ఒమిక్రాన్‌ వ్యాప్తి నానాటికీ పెరుగుతోంది. ఇప్పటివరకు అక్కడ 19 కొత్త వేరియంట్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైన బొమ్మై సర్కారు.. చర్యలు చేపట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ముమ్మరంగా పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా, కోవిడ్ 19, ఒమిక్రాన్ సంబంధిత కేసులను దృష్టిలో ఉంచుకుని కొత్త సంవత్సర వేడుకలకు సంబంధించి నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యామని సీఎం బొమ్మై విలేకరులతో అన్నారు.

ఇదిలావుంటే, ఖర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ధార్వాడ్, శివమొగ్గ జిల్లాలోని భద్రావతి, ఉడిపి, మంగళూరులో ఐదు కొత్త కేసులు నమోదయ్యాయి. ధార్వాడకు చెందిన 54 ఏళ్ల వ్యక్తి, భద్రావతికి చెందిన 20 ఏళ్ల మహిళ, ఉడిపికి చెందిన 82 ఏళ్ల వృద్ధుడు, 73 ఏళ్ల వృద్ధురాలు, మంగళూరుకు చెందిన 19 ఏళ్ల మహిళ ఓమిక్రాన్ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులందరికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులతో టీకాలు వేయబడ్డాయి. వారి ప్రయాణ చరిత్ర, అంతర్జాతీయ ప్రయాణికులతో పరిచయాలు నిర్ధారించామన్నారు. వారిలో ఎవరికీ కోవిడ్ 19 లక్షణాలు లేవు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ తెలిపింది. భద్రావతిలో ఒంటరిగా ఉన్న వ్యక్తి 218 మందితో పరిచయం కలిగి ఉన్నాడు. వారందరికీ పరీక్షలు జరిగాయి. వీరిలో 26 మందికి పాజిటివ్‌గా తేలింది. తదుపరి పరీక్షల కోసం వారి నమూనాలను పంపినట్లు ఆ శాఖ తెలిపింది. ఇంకా, మంగళూరులో 19 ఏళ్ల విద్యార్థితో ప్రాథమిక,ద్వితీయ పరిచయాలు కలిగిన 18 మందికి కోవిడ్ 19 సోకినట్లు గుర్తించారు.


Read Also… PM Modi: మహిళలకు అభ్యున్నతికి మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. స్వయం సహాయక సంఘాలకు రూ.1,000 కోట్లు బదిలీ