బ్రేకింగ్.. కరోనా ఎఫెక్ట్.. 5 రాష్ట్రాలకు కర్ణాటక రెడ్ సిగ్నల్

| Edited By: Pardhasaradhi Peri

May 28, 2020 | 6:49 PM

కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ముఖ్యంగా 5 రాష్ట్రాలకు కర్నాటక ప్రభుత్వం రెడ్ సిగ్నల్ చూపింది. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్ఛే విమానాలను గానీ, రైళ్లను గానీ, ఇతర వాహనాలను గానీ తమ రాష్ట్రంలోనికి అనుమతించబోమని ప్రకటించింది. ముఖ్యంగా రైళ్లు,  బస్సుల ద్వారా  వేలాది గా  వస్తున్న వలస కార్మికుల్లో చాలామందికి కరోనా లక్షణాలు ఉండవచ్ఛునని కర్ణాటక ఆందోళన చెందుతోంది. దేశంలోని  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు […]

బ్రేకింగ్.. కరోనా ఎఫెక్ట్.. 5 రాష్ట్రాలకు కర్ణాటక రెడ్ సిగ్నల్
Follow us on

కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ముఖ్యంగా 5 రాష్ట్రాలకు కర్నాటక ప్రభుత్వం రెడ్ సిగ్నల్ చూపింది. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్ఛే విమానాలను గానీ, రైళ్లను గానీ, ఇతర వాహనాలను గానీ తమ రాష్ట్రంలోనికి అనుమతించబోమని ప్రకటించింది. ముఖ్యంగా రైళ్లు,  బస్సుల ద్వారా  వేలాది గా  వస్తున్న వలస కార్మికుల్లో చాలామందికి కరోనా లక్షణాలు ఉండవచ్ఛునని కర్ణాటక ఆందోళన చెందుతోంది.

దేశంలోని  ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. పైగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ నుంచి ప్రజల ఎంట్రీని కర్ణాటక ప్రభుత్వం ఈ నెల 18 నే నిషేధించింది. ఆయా రాష్ట్రాల పరస్పర అంగీకారంతోనే ప్రజల లేదా ప్రయాణికుల తరలింపు  జరగాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఎదియూరప్ప ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లను అనుమతించే సూచనలు ఉన్నాయని కూడా అంటున్నారు.