భారతదేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి, గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వారం పాటు లాక్‌డౌన్

|

Apr 09, 2021 | 3:29 PM

Johnson & Johnson single-shot covid vaccine : భారత్‌లో అతిత్వరలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి రాబోతోంది..

భారతదేశంలో త్వరలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి, గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వారం పాటు లాక్‌డౌన్
Covid Vaccination
Follow us on

Johnson & Johnson single-shot covid vaccine : భారత్‌లో అతిత్వరలో మరో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటు లోకి రాబోతోంది. అమెరికాకు చెందిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. భారత్‌లో రెండు దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థకు అనుమతి లభించింది . అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్పిన్‌ను వినియోగిస్తున్నారు. కరోనా నియంత్రణలో తమ వ్యాక్సిన్‌ చాలా చక్కగా పనిచేస్తుందని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రకటించింది. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ టీకా విభిన్నమైనది. ఈ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ వేసుకుంటే సరిపోతుంది. అమెరికాలో సక్సెస్‌ రేటు ఎక్కువ కావడంతో ఈ వ్యాక్సిన్‌ వేసుకోవడానికి జనం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అటు, భారత్‌లో రష్యాకు చెందిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ కూడా త్వరలో అందుబాటు లోకి రాబోతోంది. కరోనా కేసుల విజృంభణ కారణంగా దేశంలో వ్యాక్సిన్‌ డోస్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉంది. కోవాగ్జిన్‌ , కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లను మాత్రమే భారత్‌లో ఇప్పుడు వినియోగిస్తున్నారు.

మరోవైపు, భారత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ లేకపోయినప్పటికీ.. స్వచ్ఛందంగా పలు ప్రాంతాల్లో అంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా కేసులను బట్టి స్థానికంగా ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వారం పాటు లాక్‌డౌన్ విధించారు తహశీల్దార్ నాంచారయ్య. కొల్లిపర, తూములూరు, దావులూరు అడ్డరోడ్డు గ్రామాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో.. రేపటి నుంచి 16వ తేదీ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. అయితే.. అత్యవసర సర్వీసులకు మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.

Read also : Jaya : బర్త్ డే వేళ నెట్టింట్లో అడ్డంగా బుక్కైపోతున్న జయాబచ్చన్, ఎంతటి దురహంకారమంటూ తీవ్రమైన ట్రోలింగ్