కరోనా కట్టడికి జోధ్‌పూర్‌ పోలీసుల సరికొత్త ప్రయోగం..

|

Jul 15, 2020 | 6:46 PM

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక వైరస్‌ కేసులు గల దేశాలతో భారత్‌ పోటీ పడుతూ కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ కరోనా పట్ల పలు హెచ్చరికలు చేసింది...ఈ నేపథ్యంలో..

కరోనా కట్టడికి జోధ్‌పూర్‌ పోలీసుల సరికొత్త ప్రయోగం..
Follow us on

దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకూ వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక వైరస్‌ కేసులు గల దేశాలతో భారత్‌ పోటీ పడుతూ కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ కరోనా పట్ల పలు హెచ్చరికలు చేసింది. రానున్న కాలంలో కరోనా వైరస్‌ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటువంటి తరుణంలో జోధ్‌పూర్‌లో కరోనా కట్టడి కోసం ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు అక్కడి పోలీసు అధికారులు.

జోధ్‌పూర్‌లో కరోనా వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తోంది. దీంతో అక్కడి పోలీసుల సరికొత్త తరహాలో వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టారు. జోధ్‌పూర్‌లో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ‘హర్‌ ఘర్‌ దస్తాక్’ అనే కార్యక్రమాన్ని పోలీస్‌ కమిషనర్‌ బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరి ఇంటిని స్థానిక పోలీసులు సందర్శిస్తున్నారు. క్వారంటైన్‌ నిబంధనలు వారు సరిగా పాటిస్తున్నారా లేదా అన్నది స్వయంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నవెూదు చేసి కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.