Remdesivir: ‘రెమిడెసివిర్‌’ను ఆ దేశం నుంచి తెచ్చుకుంటాం.. అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన జార్ఖాండ్ సీఎం

|

Apr 19, 2021 | 9:20 AM

Jharkhand - Bangladesh: దేశంలో కరోనావైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా తీవ్రంగా పెరుగుతోంది. దీంతో వైద్యం కోసం ఆసుపత్రుల్లో

Remdesivir: ‘రెమిడెసివిర్‌’ను ఆ దేశం నుంచి తెచ్చుకుంటాం.. అనుమతివ్వండి.. కేంద్రాన్ని కోరిన జార్ఖాండ్ సీఎం
Remdesivir
Follow us on

Jharkhand – Bangladesh: దేశంలో కరోనావైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా తీవ్రంగా పెరుగుతోంది. దీంతో వైద్యం కోసం ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా దేశవ్యాప్తంగా అధిక‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా రోగుల‌కు చికిత్సలో ఉప‌యోగించే యాంటీవైర‌ల్ డ్రగ్ రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొర‌త అంతటా ఆందోళ‌న కలిగిస్తోంది. ఇప్పటికే రిమిడెసివిర్ ఇంజక్షన్లపై మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య వివాదం నెలకొంది. దీంతోపాటు ఆక్సిజన్ సిలిండర్ల కొరత, వ్యాక్సిన్ డోసుల పంపిణీపై కూడా మాటల యుధ్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న రోగులను దృష్టిలో ఉంచుకొని రెమిడెసివిర్ ఔషధాన్ని బంగ్లాదేశ్ నుంచి దిగుమ‌తి చేసుకోవ‌డానికి అనుమ‌తించాల‌ని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు ఆయన కేంద్ర మంత్రి డీవీ స‌దానంద గౌడకు లేఖ‌ రాశారు. ఈమేరకు ఆయన ట్విట్ ద్వారా వెల్లడించారు.

జార్ఖండ్‌లో రెమిడెసివిర్ కొర‌త ఏర్పడింది. దీంతో సీరియ‌స్ కండీష‌న్‌లో ఉన్న కొవిడ్ రోగుల‌కు అవ‌స‌ర‌మైన రెమిడెసివిర్ ఇంజక్షన్ డిమాండ్ అధిక‌మ‌వుతోంది. వినియోగం కోసం అవ‌స‌ర‌మైన‌ 50 వేల వ‌యల్స్‌ను స‌ర‌ఫ‌రా చేయాల్సిందిగా బంగ్లాదేశ్‌లోని ఫార్మా కంపెనీల‌ను సంప్రదించామని హేమంత్ సొరెన్ వెల్లడించారు. వాటిని దిగుమ‌తి చేసుకోవ‌డానికి వీలైనంత తొంద‌ర‌గా కేంద్రం ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వాలని హేమంత్ సొరెన్ కోరారు. కాగా.. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త నాలుగు రోజులుగా 2 లక్షలకు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో మంచాలు, ఆక్సిజ‌న్‌, మందులు ముఖ్యంగా రెమ్‌డెసివిర్ ఇంజ‌క్షన్ల కొర‌త ఏర్పడింది. దీంతోపాటు పలుచోట్ల వ్యాక్సిన్ కొరత కూడా వేధిస్తోంది.

సోరెన్ ట్విట్..

Also Read:

‘నా సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించండి’ , ఘజియాబాద్ అధికారులకు మంత్రి వీకే .సింగ్ అభ్యర్థన

Coronavirus: కరోనా వైరస్ కొత్త లక్షణాలు ఇవే.. ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు.. వైద్యుల హెచ్చరిక..