కరోనా ఎఫెక్ట్‌తో వెటరన్ కమేడియన్ మృతి..!

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ప్రపంచ దేశాలను తాకిన ఈ వైరస్.. జపాన్‌కు చెందిన వెటరన్ కమేడియన్ కెన్ షిమురాను కూడా మింగేసింది. ఆయన వయస్సు 70. ఈ నెల మార్చి 20వ తేదీన జ్వరం, నిమోనియా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. టోక్యో నగరంలోని హిగాషి మూరయమా ప్రాంతానికి చెందిన.. ఈ కెన్ షిమురా దేశంలోనే కరోనా వైరస్ సోకిన తొలి సెలబ్రిటీ. ఈయన అసలు పేరు యసునోరి షిమూరా.1974లో జపాన్ కామిక్ సిరీస్ గ్రూప్ […]

కరోనా ఎఫెక్ట్‌తో వెటరన్ కమేడియన్ మృతి..!

Edited By:

Updated on: Mar 30, 2020 | 8:32 PM

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ప్రపంచ దేశాలను తాకిన ఈ వైరస్.. జపాన్‌కు చెందిన వెటరన్ కమేడియన్ కెన్ షిమురాను కూడా మింగేసింది. ఆయన వయస్సు 70. ఈ నెల మార్చి 20వ తేదీన జ్వరం, నిమోనియా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. టోక్యో నగరంలోని హిగాషి మూరయమా ప్రాంతానికి చెందిన.. ఈ కెన్ షిమురా దేశంలోనే కరోనా వైరస్ సోకిన తొలి సెలబ్రిటీ. ఈయన అసలు పేరు యసునోరి షిమూరా.1974లో జపాన్ కామిక్ సిరీస్ గ్రూప్ డ్రిఫ్టర్‌కు ఐకాన్‌గా నిలిచారు. షిమురా పలు టీవీ కామెజడీ షోలతో పాటు..ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే మార్చి 20న ఆస్పత్రిలో చేరిన షిమురాకు.. కరోనా పాజిటివ్ ఉన్నట్లు 23వ తేదీన తేలింది. అప్పటి నుంచి ఐసోలేషన్‌లో చికిత్స పొందుతూ.. నిమోనియా తీవ్రత పెరగడంతో ప్రాణాలు విడిచారు.