A Proud Moment of India: మన దేశం పోలియో రహిత దేశంగా మారినట్లే.. త్వరలో కరోనా రహిత దేశంగా మారుతుంది: బిగ్ బీ

|

Jan 17, 2021 | 5:26 PM

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం భారత దేశం తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అధిక జనాభాగల మనదేశంలో కోవిడ్ -19 టీకా డ్రైవ్ ను విజయవంతంగా నిర్వహించి అనేక దేశాలతో ప్రశంసలను..

A Proud Moment of India: మన దేశం పోలియో రహిత దేశంగా మారినట్లే.. త్వరలో కరోనా రహిత దేశంగా మారుతుంది: బిగ్ బీ
Follow us on

A Proud Moment of India: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం భారత దేశం తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అధిక జనాభాగల మనదేశంలో కోవిడ్ -19 టీకా డ్రైవ్ ను విజయవంతంగా నిర్వహించి అనేక దేశాలతో ప్రశంసలను అందుకుంది. తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. భారతదేశాన్ని కరోనావైరస్ రహిత దేశంగా మార్చడం గురించి మాట్లాడారు. మన దేశం ఎలా పోలియో రహితంగా దేశంగా మారిందని గర్విస్తున్నామో.. అలాగే త్వరలో కోవిడ్ 19 రహిత దేశంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను.. నాదేశం కోవిడ్ నుంచి విముక్తి పొందిందని దేశమని గర్వంగా చెప్పుకుంటానని జై హింద్ అంటూ ట్వీట్ చేశారు బిగ్ బీ. జూలై 2020 అమితాబ్ బచ్చన్ భార్య జయ బచ్చన్ మినహా ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

 

Also Read: అంకుల్, ఆంటీ ఉన్నంత మాత్రాన బాలీవుడ్ లో నటుడిగా ప్రయాణం అంత ఈజీ కాదు : సిద్ధార్థ్