కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన ఆ నగరం..

కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరు చూస్తే.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ వైరస్.. మధ్యప్రదేశ్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇండోర్‌లో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని నగరాల కంటే కూడా.. కేవలం ఇండోర్‌ నగరంలోనే కరోనా వైరస్ కేసులు […]

కరోనాకు హాట్‌స్పాట్‌గా మారిన ఆ నగరం..

Edited By:

Updated on: Mar 28, 2020 | 11:04 PM

కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరు చూస్తే.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ముఖ్యంగా మన దేశంలో గత వారం రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే ఈ వైరస్.. మధ్యప్రదేశ్‌లో వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇండోర్‌లో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న అన్ని నగరాల కంటే కూడా.. కేవలం ఇండోర్‌ నగరంలోనే కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

తాజాగా ఇక్కడ ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండోర్ తర్వాత.. ఎక్కువ కేసులు రాష్ట్ర రాజధాని భోపాల్ ఉంది. ఇక్కడ ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇండోర్, ఉజ్జయినిలలో వైరస్ ప్రభావంతో.. ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇండోర్‌లో కేవలం మూడు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15కు చేరినట్లు అధికారు గణంకాలు చెబుతున్నాయి. కాగా.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ జర్నలిస్టు.. మాజీ సీఎం ప్రెస్‌మీట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ వచ్చిన ఆ జర్నలిస్ట్ క్వారంటైన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన వెళ్లిన ప్రెస్‌ మీట్‌కు హాజరైన మిగతా జర్నలిస్టులతో పాటు.. కమల్‌నాథ్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.