క్లినికల్‌ ట్రయల్స్‌లో మూడు వ్యాక్సిన్లు..!

| Edited By:

Aug 05, 2020 | 6:35 AM

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు.. దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ (ICMR) మంగళవారం నాడు తెలిపింది. మూడు కూడా భారత్‌కు చెందిన..

క్లినికల్‌ ట్రయల్స్‌లో మూడు వ్యాక్సిన్లు..!
Follow us on

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు.. దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ (ICMR) మంగళవారం నాడు తెలిపింది. మూడు కూడా భారత్‌కు చెందిన వ్యాక్సిన్లేనని.. ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయని ICMR డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ముఖ్యంగా భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్‌
తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుందని.. దానికి తోడుగా.. జైడస్ కాడిలాకు చెందిన డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా ఫస్ట్‌ ఫేస్‌ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తిచేసుకున్నాయన్నారు. ఇక ఈ రెండు వ్యాక్సిన్లకు రెండో ఫేస్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇక మూడవ వ్యాక్సిన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ వ్యాక్సిన్‌ అని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  (ఎస్ఐఐ) తయారు చేస్తోందని.. అయితే ఈ వ్యాక్సిన్‌కు ఫస్ట్ ఫేస్ పూర్తవ్వడంతో పాటుగా.. సెకండ్‌,థర్డ్‌ (ఫైనల్‌) ఫేస్‌ క్లినికల్ ట్రయిల్స్‌కు పర్మిషన్స్‌ లభించాయన్నారు. వారం రోజుల్లో 17 17 ప్రాంతాల్లో ట్రయిల్స్ ప్రారంభమవుతాయన్నారు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం