వుహాన్‌ను దాటేసిన మహారాష్ట్ర..దేశంలో పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కరలనృత్యం చేస్తోంది. కోవిడ్19 కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య పరంగా మహారాష్ట్ర వుహాన్‌ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో ఇంతవరకు లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 9,987 కొత్త కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య2,66,598కి చేరింది. కరోనా వైరస్ మహమ్మారికి చిక్కి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్క రోజే 331 మంది చనిపోయారు. […]

వుహాన్‌ను దాటేసిన మహారాష్ట్ర..దేశంలో పెరుగుతున్న కేసులు

Updated on: Jun 09, 2020 | 11:12 AM

దేశంలో కరోనా మహమ్మారి కరలనృత్యం చేస్తోంది. కోవిడ్19 కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కేసుల సంఖ్య పరంగా మహారాష్ట్ర వుహాన్‌ను దాటేసింది. గడిచిన 24 గంటల్లో ఇంతవరకు లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 9,987 కొత్త కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య2,66,598కి చేరింది. కరోనా వైరస్ మహమ్మారికి చిక్కి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్క రోజే 331 మంది చనిపోయారు. ఒక్కరోజే ఇంత మంది మృత్యువాత పడటం ఇదే మొదటి సారి అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,66,598

దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,29,917

దేశవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 7,466

క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారు 129215

కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. అంతేకాదు… మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలోని వుహాన్‌ను మించిపోతోంది. ప్రస్తుతం ముంబైలో 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.