కరోనా విజృంభణ.. టాప్ 10లో భారత్

|

May 26, 2020 | 2:36 PM

భారతావనిపై కరోనా ప్రతాపం కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 6,535 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.

కరోనా విజృంభణ.. టాప్ 10లో భారత్
Follow us on

భారతావనిపై కరోనా ప్రతాపం కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా దేశంలో నిత్యం 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 6,535 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,45,380కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 4,167 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.

దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,380
దేశంలో ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 80,722
దేశవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,167
క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన‌వారు 60,490

వైరస్‌ దెబ్బకు తాజాగా 146 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,167కు పెరిగింది. లక్ష కేసులు నమోదుకావడానికి రెండు నెలల సమయం పట్టగా.. కేవలం గత వారంలోనే 45వేల కేసులు నమోదుకావడం వైరస్‌ ఉద్రితికి అద్దం పడుతోంది. మహారాష్ట్రలో వైరస్‌ తీవ్రత ఆందోళనకరస్థాయిలో ఉండగా తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజురోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది.