
భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 49,931 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,35,453కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4,85,114 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే నిన్న కరోనా నుంచి కోలుకుని31,991 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోవిడ్ మహమ్మారి బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 9,17,568గా నమోదైంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 708 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి బారినపడి 32,771 మంది మరణించారు.
Read More:
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మృతి
పక్షి పిల్లల కోసం 40 రోజులుగా ఆ గ్రామంలో వెలగని వీధి లైట్లు..
పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో పూర్తిస్థాయి లాక్‌డౌన్..