కరోనా అప్‏డేట్: భారత్‏లో 98 లక్షలను దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజులోనే 442 మంది మృతి..

|

Dec 12, 2020 | 11:01 AM

భారత్‏లో కరోనా కేసులు 98 లక్షల మార్కును దాటేసాయి. అటు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య కాస్తా తగ్గుముఖం పట్టాయి.

కరోనా అప్‏డేట్: భారత్‏లో 98 లక్షలను దాటిన కరోనా కేసులు.. ఒక్కరోజులోనే 442 మంది మృతి..
Follow us on

భారత్‏లో కరోనా కేసులు 98 లక్షల మార్కును దాటేసాయి. అటు దేశంలో రోజువారీ కేసుల సంఖ్య కాస్తా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 10,65,176 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 30,006 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33, 494 మంది వైరస్ నుంచి కోలుకొని ఇళ్ళకు వెళ్ళారు. కాగా దేశవ్యాప్తంగా రికవరీ కేసుల సంఖ్య 93,24,328కి చేరింది.

ప్రస్తుతం దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమంగా కోటి దిశగా ప్రయనిస్తుంది. దీంతో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 98,26,775కు చేరింది. దేశంలో క్రియాశీల కేసుల్లో తగ్గుదల అలాగే కొనసాగుతుంది. శుక్రవారం వరకు 3,59,819 క్రియాశీల కేసులుండగా.. ఆరేటు 3.66 శాతానికి తగ్గింది. అటు దేశంలో గడిచిన 24 గంటల్లో 442 మంది మరణించగా.. ఇప్పటివరకు దేశంలో 1,42,628 మంది ఈ వైరస్‏కు బలయ్యారు.