రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

| Edited By:

Aug 20, 2020 | 11:51 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే విధంగా టెస్టుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో..

రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే విధంగా టెస్టుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. రోజురోజుకు కరోనా టెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9.18 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో పరీక్షలు నిర్వహించడం ఇదే మొదటి సారి అని అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒక మిలియన్‌ ప్రజానీకంలో 23.6 వేల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక దేశంలో కరోనా నుంచి కోలుకుని 21 లక్షల మందికి పైగా ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేటు 74 శాతంగా ఉందని పేర్కొన్నారు.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్