Rapid Antigen Tests: కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఇకనుంచి వారికి మాత్రమే.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు..

| Edited By: Rajeev Rayala

May 20, 2021 | 6:28 AM

ICMR on Rapid Antigen Tests: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కీలక ప్రకటన చేసింది. కరోనా లక్షణాలున్న వ్యక్తులు, ఆర్‌టీపీసీఆర్‌

Rapid Antigen Tests: కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఇకనుంచి వారికి మాత్రమే.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు..
Rapid Antigen Tests
Follow us on

ICMR on Rapid Antigen Tests: ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు కిట్ల గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కీలక ప్రకటన చేసింది. కరోనా లక్షణాలున్న వ్యక్తులు, ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారిని కాంటాక్ట్‌ అయిన వ్యక్తులకు మాత్రమే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు కిట్లను వాడాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. యాంటీజెన్‌ కిట్ల ద్వారా పాజిటివ్‌గా తేలిన వారందరినీ పాజిటివ్‌గా పరిగణించవచ్చని పేర్కొంది. అయితే వారికి మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. యాంటీజెన్‌ టెస్టు కిట్ ద్వారా నెగెటివ్‌గా తేలి.. లక్షణాలున్న వ్యక్తులందరూ వెంటనే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షను చేయించుకోవాలని సూచించింది.

యాంటీజెన్‌ టెస్టులో నెగెటివ్‌గా తేలి, లక్షణాలున్న వారందరినీ కొవిడ్‌ అనుమానితులుగా భావించవచ్చని మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాంటి వారంతా ఐసీఎంఆర్‌/ఆరోగ్య శాఖ హోం ఐసొలేషన్‌ మార్గదర్శకాలను పాటించాలని సూచించింది. కాగా.. కరోనా నిర్ధారణకు ఇంట్లో చేసుకునే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌ ‘కొవిసెల్ఫ్‌’కు ఐసీఎంఆర్‌ ఆమోదముద్ర వేసింది. మహారాష్ట్ర పూణెలోని మై ల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ సంస్థ ఈ ర్యాట్ కిట్‌ను రూపొందించింది. దీని ద్వారా ఇంటినుంచే కరోనా పరీక్షను చేసుకోవచ్చు.

Also Read:

COVID-19: ఆ రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిత్యం 500లకు పైగా మరణాలు..

దేశంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు ఇవే..! ఒక్కో స్టేషన్‌కి ఒక్కో చరిత్ర.. తెలుసుకోండి..