ఐ యామ్ ఫైన్….కరోనా అంటే భయపడకండి…శివరాజ్ సింగ్ చౌహాన్

కరోనా పాజిటివ్ కి గురైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..తన ఆరోగ్యం బాగానే ఉందని ట్వీట్ చేశారు. కరోనాపై పోరు జరుపుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వీరు నిస్వార్థంగా తమ ప్రాణాలను..

ఐ యామ్ ఫైన్....కరోనా అంటే భయపడకండి...శివరాజ్ సింగ్ చౌహాన్

Edited By:

Updated on: Jul 26, 2020 | 4:18 PM

కరోనా పాజిటివ్ కి గురైన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్..తన ఆరోగ్యం బాగానే ఉందని ట్వీట్ చేశారు. కరోనాపై పోరు జరుపుతున్న ఫ్రంట్ లైన్ వారియర్లను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. వీరు నిస్వార్థంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈ వైరస్ మీద పోరాటం జరుపుతున్నారని, వారికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉండాలని శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఈ వైరస్ అంటే భయపడరాదని, ఏ మాత్రం పాజిటివ్ లక్షణాలు కనబడినా చికిత్స చేయించుకోవాలని కోరారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు.