కరోనా కల్లోలంలో ఉచిత అంబులెన్స్ సేవలు..హైదరబాదీల గొప్ప మనసు

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు..వైరస్ బారినపడ్డవారి కష్టాలు చాలానే ఉన్నాయి. దురదృష్టవశాత్తు వైరస్ సోకి మరణించిన వారు అనాధలుగా కాటికి వెళ్లాల్సిన దుస్థితి తలెత్తుతోంది. చివరకు కొన్ని ప్రాంతాల్లో అయితే, కనీసం శవాలను ఖననం చేసే దిక్కుకూడా లేని దృశ్యాలు కలచివేస్తున్నాయి.

కరోనా కల్లోలంలో ఉచిత అంబులెన్స్ సేవలు..హైదరబాదీల గొప్ప మనసు

Updated on: Jul 03, 2020 | 6:13 PM

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు..వైరస్ బారినపడ్డవారి కష్టాలు చాలానే ఉన్నాయి. దురదృష్టవశాత్తు వైరస్ సోకి మరణించిన వారు అనాధలుగా కాటికి వెళ్లాల్సిన దుస్థితి తలెత్తుతోంది. చివరకు కొన్ని ప్రాంతాల్లో అయితే, కనీసం శవాలను ఖననం చేసే దిక్కుకూడా లేని దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఆస్పత్రుల్లో మరణించిన మ‌ృతదేహలను తరలించేందుకు వాహనాలు కూడా దొరకని పరిస్థితుల్లో హైదరాబాదీలు తమ మానవత్వం చాటుకుంటున్నారు. పది మంది సామాజిక కార్యకర్తలు చొరవ తీసుకొని ఓ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో ఈ అంబులెన్స్‌ ద్వారా కరోనా బాధిత మ‌ృతులకు సేవలందిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

నగరానికి చెందిన ఓ సామాజిక బ‌ృందం సభ్యులు పది కలిసి ఆన్‌లైన్లో రూ.70 వేలకు ఓ సెకండ్ హ్యాండ్ మారుతీ ఓమ్నీని కొనుగోలు చేశారు. దాన్ని అంబులెన్స్‌గా మార్చి..అందులో డెడ్ బాడీని ఉంచే విధంగా ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ఇన్ఫెక్షన్ సోకే ముప్పు లేకుండా ఓ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అదనంగా మరో రూ.20 వేలు వెచ్చించారు. . ‘సర్వ్ ది నీడీ’ పేరిట సైబరాబాద్ పోలీసు కమిషరేట్ పరిధిలో ఈ అంబులెన్స్ ద్వారా కరోనా బాధితుల డెడ్ బాడీలను ఉచితంగా తరలించనున్నారు. ఇందుకోసం ఇద్దరు డ్రైవర్లు ఒక అటెండర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. వారికి జీతం ఇవ్వడంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తామని చెప్పారు. డిమాండ్‌ను బట్టి సేవలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని వారు తెలిపారు.