గోరఖ్‌పూర్‌లో కోవాక్సిన్‌ ట్రయల్స్‌ షురూ

యూపీలోకి గోరఖ్‌పూర్‌లో కరోనా పేషెంట్స్‌పై భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన "కోవాక్సిన్‌" వ్యాక్సిన్ హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. గోరఖ్‌పూర్‌లోని రాణా హస్పిటల్‌ అండ్ ట్రౌమా సెంటర్‌లో..

గోరఖ్‌పూర్‌లో కోవాక్సిన్‌ ట్రయల్స్‌ షురూ

Edited By:

Updated on: Aug 01, 2020 | 6:46 PM

యూపీలోకి గోరఖ్‌పూర్‌లో కరోనా పేషెంట్స్‌పై భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన “కోవాక్సిన్‌” వ్యాక్సిన్ హ్యూమన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. గోరఖ్‌పూర్‌లోని రాణా హస్పిటల్‌ అండ్ ట్రౌమా సెంటర్‌లో ఈ క్లినికల్ ట్రయల్స్‌ ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రయల్స్‌ గురువారం సాయంత్రం నుంచి మొదలయ్యాయని.. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం దేశంలో 12 సెంటర్లను కోవ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు ఎంపిక చేశారు. ఆ సెంటర్లలో గోరఖ్‌పూర్‌కు చెందిన రాణా ఆస్పత్రి కూడా ఒకటి. మొత్తం 34 వ్యాక్సిన్లు రాణా ఆస్పత్రికి వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.ఇప్పటికే కొంతమంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ ఇచ్చామని.. వారిని ఆస్పత్రిలో వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ తీసుకున్న వారంతా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

కాగా, గ‌తంలో కూడా రాణా హాస్పటల్‌ అండ్ ట్రౌమా సెంటర్‌లో టైఫాయిడ్‌, జ‌ప‌నీస్ ఎన్‌సిఫ‌లిటిస్ వ్యాక్సిన్ల‌కు హ్యూమన్‌ ట్ర‌య‌ల్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

Read More

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు