Haridwar Kumbh Mela 2021: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భక్తులు హరిద్వార్‌కు భారీగా చేరుకోని రెండో షాహీ స్నానాలను ఆచరిస్తున్నారు. కుంభమేళా గంగా హారతిని పురస్కరించుకొని గంగానదిలో సోమవారం, బుధవారం భక్తులు షాహీ స్నానాలు ఆచరించనున్నారు. ఈ మేరకు ఉత్తరఖండ్ ప్రభుత్వం గంగా జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ.. నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతోంది. భక్తులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇలా జరుగుతుండటంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
#WATCH | People take a holy dip in Ganga river at Har Ki Pauri in Haridwar, Uttarakhand. pic.twitter.com/xgnAbc9hAW
— ANI (@ANI) April 12, 2021
ఇదిలాఉంటే.. హరిద్వార్‌కు వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేస్తున్నారు. తాజాగా చాలా మంది వరకూ కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. షాహీ స్నాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 372 మంది భక్తులకు కరోనావైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. 12 ఏళ్లకు ఓ సారి జరుగుతున్న మహా కుంభమేళా కావడంతో భక్తులు భారీగా చేరుకుంటున్నారు.
Uttarakhand: People take a holy dip in Ganga river at Har Ki Pauri in Haridwar.
Kumbh Mela IG Sanjay Gunjyal says, “General public will be allowed here till 7 am. After that, this area will be reserved for akharas”. pic.twitter.com/9PtcP9WwwG
— ANI (@ANI) April 11, 2021
Also Read: