ఢిల్లీ…కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై అమిత్ షా ఫోకస్

| Edited By: Pardhasaradhi Peri

Jun 22, 2020 | 10:49 AM

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని అతి ముఖ్యమైన సూచనలు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ని ముమ్మరం చేయాలని, మొత్తం కంటెయిన్మెంట్ స్ట్రాటజీ ని మార్చాలని, ఎక్కువ కేసులున్న ప్రాంతాల్లో మెడికల్ సర్వీసులను పెంచాలని ఆయన సూచించారు. కరోనా రోగి ఎవరు మరణించినా.. ఏ పరిస్థితుల్లో మరణించాడన్న అంశంపై కేంద్రానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలన్నారు. అటు-అమిత్ షా నేతృత్వంలో ఓ […]

ఢిల్లీ...కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై అమిత్ షా ఫోకస్
Follow us on

ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని అతి ముఖ్యమైన సూచనలు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ని ముమ్మరం చేయాలని, మొత్తం కంటెయిన్మెంట్ స్ట్రాటజీ ని మార్చాలని, ఎక్కువ కేసులున్న ప్రాంతాల్లో మెడికల్ సర్వీసులను పెంచాలని ఆయన సూచించారు. కరోనా రోగి ఎవరు మరణించినా.. ఏ పరిస్థితుల్లో మరణించాడన్న అంశంపై కేంద్రానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిపోర్టు చేయాలన్నారు. అటు-అమిత్ షా నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటైంది. కరోనా రోగులందరి కాంటాక్టులను  ఐసొలేట్ చేయాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఆరోగ్యసేతు, ఇతిహాస్ యాప్ లను అందరూ వినియోగించుకోవాలని ఈ కమిటీ కోరింది. కరోనా రోగి ఐసోలేషన్ లో మరణించాడా లేక.. సరైన సమయంలో ఆసుపత్రికి రాకపోవడం వల్లో, లేదా ఆసుపత్రిలో మృతి చెందాడా అన్న విషయాన్ని ప్రభుత్వం కేంద్రానికి రెఫర్ చేయాలని  ఈ కమిటీ సూచించింది. కరోనా రోగులందరూ కోవిడ్-19 కేంద్రాలకు తరలాలని, ఇంటిలో సౌకర్యాలు ఉన్నవారు స్వీయ నియంత్రణ పాటించాలని కమిటీ సభ్యులు కోరారు. హోం క్వారంటైన్ పై ఢిల్లీ సర్కార్ సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ నగరంలో ఆదివారం ఒక్క రోజే 3 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. మొదటి దశగా సుమారు 20 వేల మందికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ సయుక్తంగా సర్వే చేయాలని  ఆదివారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. నగరంలో దాదాపు 60 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. జులై మాసాంతానికి ఈ కేసులు అయిదున్నర లక్షలకు పెరగవచ్చునని భయపడుతున్నారు.