క‌రోనాతో క‌న్నుమూసిన ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌

కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మృతి చెందారు. ఇప్పుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌..కరోనా బారిన పడి కన్నుమూశారు.

క‌రోనాతో క‌న్నుమూసిన ప్ర‌ముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌

Edited By:

Updated on: Apr 18, 2020 | 3:12 PM

కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు మృతి చెందారు. ఇప్పుడు హాలీవుడ్‌ ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అల్లెవ్‌ డీవియో కరోనా బారిన పడి కన్నుమూశారు. ఆయన వయసు 77 ఏళ్లు. లూసియానా రాష్ట్రం న్యూఓర్లీన్స్‌లో 1942 జూన్‌ 14న అల్లెవ్‌ జన్మించారు. 1960లో స్టీవెన్‌ స్పీల్స్‌బర్గ్‌ను లాస్‌ఏంజెల్స్‌లో కలిశారు. ఆ తర్వాత ఆయన అక్కడే స్థిరపడిపోయారు. ది కలర్‌ పర్పల్‌, ది ఎంపైర్‌ ఆఫ్‌ ద సన్‌, ది ఈటీ ఎక్స్‌ట్రా టెరిస్టరియల్‌, యవలాన్‌, బగ్సీ వంటి పాపులర్‌ సినిమాలకు కెమెరామేన్‌గా పని చేశారు. ఈ చిత్రాలు అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయ్యాయి.
అల్లెవ్‌ కొన్ని సీరియళ్లలో కూడా నటించారు. షూటింగ్‌ సమయంలో అల్లెవ్ లైటింగ్‌ అరెంజ్‌మెంట్స్‌, తీసే కోణం అద్భుతంగా ఉంటుందన్న ప్రశంసలు అందుకున్నారు. హాలివుడ్ ప్రముఖ దర్శకుడు  స్టీవెన్‌ స్పీల్స్‌బర్గ్‌కు అత్యంత సన్నిహితుడిగా అల్లెవ్ కు పేరుంది. అల్లెన్ మరణంపై  స్పీల్స్‌బర్గ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని ఓ ప్రకటన విడుదల చేశాడు. దర్శకుడి ఆలోచనకు జీవం పోసేది ఫొటోగ్రాఫరే. ఆ పాత్రను గొప్పగా పోషించిన అల్లెవ్‌ డీవియో మృతి హాలీవుడ్‌కు తీరని లోటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.