వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు ముమ్మరం చేసిన కేంద్రం..

| Edited By: Pardhasaradhi Peri

Apr 01, 2020 | 8:16 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోయే సరికి.. అంతా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరు లక్షల మందికిపైగా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ రెడీ చేసేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే చైనా క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోండగా.. ఏకంగా జాన్సన్ అండ్ జాన్సన్.. సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ […]

వ్యాక్సిన్‌ కోసం పరిశోధనలు ముమ్మరం చేసిన కేంద్రం..
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోయే సరికి.. అంతా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరు లక్షల మందికిపైగా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ రెడీ చేసేందుకు అన్ని దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే చైనా క్లినికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోండగా.. ఏకంగా జాన్సన్ అండ్ జాన్సన్.. సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ చేసి అందుబాటులోకి తీసుకోస్తామని అమెరికాతో డీల్ కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మనదేశం కూడా వ్యాక్సిన్ ప్రిపరేషన్‌లో దూసుకెళ్తున్నట్లు మంగళవారం ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వ్యాక్సిన్‌ రూపొందించే ప్రక్రియలో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపింది.

ఈ మహమ్మారిని అదుపులోకి తెచ్చేందుకు విదేశాల నుంచి వచ్చిన వారితో క్లోజ్‌గా మూవ్ అవుతున్న వారిని గుర్తించి.. క్వారంటైన్‌లో ఉంచే ప్రక్రియ పకడ్బందీగా సాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కరోనావైరస్‌ అధికంగా వ్యాపించిన హాట్‌స్పాట్‌లను గుర్తిస్తూ.. అది ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రభుత్వం కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ భయంకరమైన మహమ్మారిని దేశం నుంచి తరిమేందుకు ప్రజలంతా సహకరించాలన్నారు.

కాగా.. గత నాలుగు రోజుల క్రితమే.. హైదరాబాద్‌ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ కూడా టీకా తయారు చేసి.. టెస్టింగ్‌కు పంపిన విషయం తెలిసిందే.