కరోనా నుంచి కోలుకున్న వారికి మంత్రి ఈటల విజ్ఞప్తి

|

Jul 09, 2020 | 2:26 PM

తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తుండగా..అదే స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. అయితే, రికవరీ రేటు విషయంలో రాష్ట్రానికి కాస్తా ఊరట లభిస్తున్నట్లుగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా నుంచి కోలుకున్న వారికి మంత్రి ఈటల విజ్ఞప్తి
Follow us on

తెలంగాణలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తుండగా..అదే స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగానే నమోదవుతూ వస్తోంది. అయితే, రికవరీ రేటు విషయంలో రాష్ట్రానికి కాస్తా ఊరట లభిస్తున్నట్లుగానే ఉందంటున్నారు వైద్య నిపుణులు. ఈ క్రమంలోనే కోవిడ్ బారిన పడి కోలుకున్న బాధితులకు వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కీలక అభ్యర్థన చేశారు. కరోనా నుంచి రికవరీ అయిన వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానం వల్ల కరోనా రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చాని ఈటల తన అధికారిక ట్విట్టర్ ద్వారా సూచించారు.

కరోనా వైరస్ బారినపడి, పరిస్థితి విషమించిన వారికి ప్లాస్మా థెరపీ చికిత్స అందించడం ద్వారా వారు కోలుకుంటున్నారు. దీంతో కోవిడ్ స్పెషల్ ఆస్పత్రి గాంధీ ఆస్పత్రిలోనూ అవసరమైన కరోనా బాధితులకు ప్లాస్మా ట్రీట్‌మెంట్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇందుకోసం కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యంగా మారిన వారి నుంచి ప్లాస్మా సేకరించాల్సి ఉంటుంది. బ్లడ్ గ్రూపులు కూడా సరిపోవాల్సి ఉంటుంది. రికవరీ రేటు బాగుండటంతో… గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం.