Deve Gowda Corona Postive: మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు కరోనా పాజిటివ్.. పూర్తి వివరాలు

|

Mar 31, 2021 | 1:20 PM

భారత మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. ఆయన భార్య చెన్నమ్మకు కూడా వైరస్​ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఆయనే స్వయంగా తెలిపారు.

Deve Gowda Corona Postive: మాజీ ప్రధాని దేవెగౌడ దంపతులకు కరోనా పాజిటివ్.. పూర్తి వివరాలు
deve gowda corona positive
Follow us on

భారత మాజీ ప్రధాని హెచ్​డీ దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. ఆయన భార్య చెన్నమ్మకు కూడా వైరస్​ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా ఆయనే స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఇరువురు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దేవెగౌడ వెల్లడించారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు  చేయించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, తన క్షేమం కోరేవారు ఆందోళన చెందాల్సిన  అవసరం లేదని పేర్కొన్నారు.

కాగా దేవెగౌడ దంపతులు త్వరగా కోలుకోవాలని  దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కోరుకుంటున్నారు. కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ పెడుతోంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదకరంగా పెరిగింది. మహారాష్ట్రలో అయితే పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

దేశంలో మరోసారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న మహమ్మారి…

దేశంలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 53,480 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఇక కరోనా కారణంగా 354 మంది మృత్యువాత పడ్డారు. ఇక 24 గంటల్లో 41,280 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలాఉంటే.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,21,49,335 చేరింది. ఇదే సమయంలో 1,14,34,301 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 5,52,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 1,62,468 మంది చనిపోయారు. మరోవైపు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగవంతం చేశాయి.

Also Read:  గతంలో 20 బంతుల్లో 102 పరుగులు, ఇప్పుడు ఫ్లడ్‌లైట్ల పైనుంచి భారీ సిక్సర్.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్

టీ పొడి అనుకుని ఎండ్రిన్ గుళికలు వేసింది.. ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం