స్వీయ నిర్బంధమే మనకు శ్రీరామరక్ష – హరీష్ రావు

|

Apr 01, 2020 | 1:36 PM

స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష అని మంత్రి హరీష్ రావు అన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావుశుభాకాంక్షలు తెలిపారు...

స్వీయ నిర్బంధమే మనకు శ్రీరామరక్ష – హరీష్ రావు
Follow us on
తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్ అదుపులోనే ఉంద‌ని అంతా భావించారు. గాంధీ ఆస్ప‌త్రిలో చేరిన క‌రోనా పాజిటివ్ కేసులు 11 మందిని డిశార్జ్ చేస్తున్న‌ట్లుగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. అంత‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల‌పై పిడుగులాంటి వార్త ప‌డింది. నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల రూపంలో ఉప‌ద్ర‌వం ముంచుకొచ్చింది. ఈ ప్రార్థ‌న‌ల‌కు రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జ‌లు వంద‌ల సంఖ్య‌లో వెళ్లారు. ఈ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు అధికారులు. ఈ సంద‌ర్భంగా రేప‌టి శ్రీరామ‌న‌వ‌మిపై ఆందోళ‌న చెందుతున్న ప్ర‌జ‌ల‌కు మంత్రి హ‌రీష్ ఓ పిలుపునిచ్చారు.
స్వీయ నిర్బంధమే శ్రీరామరక్ష  అని  మంత్రి హరీష్ రావు అన్నారు.  శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావుశుభాకాంక్షలు తెలిపారు…..శ్రీరాముడు కష్టాల్లో మనో నిబ్బరం కోల్పోకుండా ముందుకు సాగి విజయం సాధించారనీ,  శ్రీరామున్ని ఆదర్శంగా తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. విశ్వాసాన్ని వినాశనం చేసేలా దాపురించిన మహమ్మారి కరోనాని మనో ధైర్యం తో తరిమికొడదామని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీరామ నవమి వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని , ఆరుబయట కాకుండా ఆలయాల్లో కేవలం అర్చకుల సమక్షంలోనే శ్రీ సీతారామ కల్యాణం చేయాలన్నారు..
ఇదిలా ఉంటే,..రాష్ట్రంలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారితోనే సమస్య నెలకొందని భావించిన సర్కారు, ఇప్పుడు ఢిల్లీ వెళ్లొచ్చిన వారితో తలలు పట్టుకుంటోంది. ఈ 1,030 మంది ఇంకెందరిని కలిసి ఉంటారనేది వైద్యాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. మొదటి కరోనా కేసుగా నమోదైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 86 మందితో క్లోజ్‌గా ఉన్నా, ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. బయటి నుంచి వచ్చిన పాజిటివ్‌ కేసులు, వారి ద్వారా అంటించుకున్న వారు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 20 మందికి సోకడం, వారిలో ఆరుగురు చనిపోవడంతో వైరస్‌ జన సమూహంలోకి ఏ మేరకు వెళ్లిందోననేది వైద్య, ఆరోగ్యశాఖ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇలా వైరస్‌ జన సమూహంలోకి పోవడాన్నే కరోనా మూడో దశగా వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ దశలో బాధితుల్ని గుర్తించడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు.