మౌత్‌వాష్‌లతో పుక్కిలిస్తే తగ్గుతున్న కరోనా వైరస్‌

మౌత్‌వాష్‌లతో పుక్కలిస్తే నోరు, గొంతులోని కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతోందని ఓ అధ్యయనంలో తేలింది. వీటి వలన ఇతరులకు కరోనా సంక్రమించే అవకాశం

మౌత్‌వాష్‌లతో పుక్కిలిస్తే తగ్గుతున్న కరోనా వైరస్‌

Edited By:

Updated on: Aug 11, 2020 | 4:13 PM

Gargling with mouthwash to stop Corona spread: మౌత్‌వాష్‌లతో పుక్కి లిస్తే నోరు, గొంతులోని కరోనా వైరస్‌ కణజాలం తగ్గుతోందని ఓ అధ్యయనంలో తేలింది. వీటి వలన ఇతరులకు కరోనా సంక్రమించే అవకాశం తగ్గుతుందని జర్మనీలోని రూర్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అలాగని మౌత్‌వాష్‌ ఉపయోగించి కరోనాను నయం చేయడం సాధ్యం కాదని వారు స్పష్టతను ఇచ్చారు.

కరోనా సోకిన రోగుల్లో గొంతులో అధిక మొత్తంలో వైరల్‌ లోడ్‌ కనిపిస్తోందని, ముక్కు చీదినప్పుడు, శ్వాస వదిలినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు వైరస్ బయటకు వస్తోందని పరిశోధకులు తెలిపారు.. ఈ క్రమంలో మౌత్‌వాష్‌లతో నోటిని పుక్కిలించడం వలన వైరస్‌ కణాల సంఖ్య తగ్గి సంక్రమణకు అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. 30 సెకన్ల పుక్కిలింత తరువాత వైరస్ కణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక తమ పరిశోధనలో చాలా మౌత్‌వాష్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయని, మూడు రకాలైతే వైరస్‌ని పూర్తిగా తొలగించాయని వారు వివరించారు. అయితే నోరు పుక్కించుకున్న నోరు పుక్కిలించుకున్న తరువాత ఈ ప్రభావం ఎంత సేపు ఉంటుందో తెలీదని పేర్కొన్నారు.

Read This Story Also: హీరోగా మహేష్‌ అయితేనే విలన్‌గా నటిస్తా