ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స

| Edited By:

Aug 30, 2020 | 1:09 PM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా డీప్‌ కోమాలోనే, అపస్మారక స్థితిలో..

ఇంకా డీప్‌ కోమాలోనే ప్రణబ్.. వెంటిలేటర్ మీద చికిత్స
Follow us on

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని.. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. తాజాగా ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండీషన్ గురించి వివరించారు వైద్యులు. ఆయన ఇంకా డీప్‌ కోమాలోనే, అపస్మారక స్థితిలో ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. అయితే ప్రణబ్ శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలు మాత్రం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. కాగా ఈ నెల 10వ తేదీన ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీకి వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా వైరస్ సోకినట్టు నిర్థారణ అయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు.

Read More:

బ్రేకింగ్: ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

అన్నదాతలే మనకి గర్వకారణం.. ‘మన్‌కీ బాత్’లో ప్రధాని

మరో ఏపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

బ్రేకింగ్: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి