మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటివ్

| Edited By:

Aug 26, 2020 | 8:33 AM

తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి కరోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు జూపల్లి. గత వారం రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్న వారు చికిత్స తీసుకోవాలని..

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కరోనా పాజిటివ్
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక అందులోనూ పలువురు రాజ‌కీయ నాయ‌కులు వ‌రుస పెట్టి కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతూనే ఉంటున్నారు. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి కరోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు జూపల్లి. గత వారం రోజులుగా తనను కలిసిన కార్యకర్తలు టెస్టులు చేయించుకోవాలని, లక్షణాలున్న వారు చికిత్స తీసుకోవాలని సూచన‌లు చేశారు. అలాగే జూప‌ల్లి కుటుంబ స‌భ్యుల‌కు కూడా వైద్యులు కోవిడ్ టెస్టులు చేస్తున్నారు.

కాగా ప్ర‌స్తుతం తెలంగాణలో గ‌త‌ 24 గంటల్లో రాష్ట్రంలో 2,579 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670కు చేరింది. 24 గంటల్లో 9 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 770కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,752 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 84,163కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 23,737 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 52933 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 10,21,054కు చేరింది.

Also Read:

ఆ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులకు సీఎం జ‌గ‌న్‌ గుడ్ న్యూస్‌

బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్?

కరోనా వైరస్‌తో ఆర్మీ జవాను మృతి

సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు