లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఎమ్మెల్యే ఆ పనిచేశాడని.. పోలీసులు ఏం చేశారంటే..

| Edited By:

Mar 26, 2020 | 7:20 AM

కరోనా దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కొంటూ పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. గుంపులు గుంపులుగా ఉండరాదని.. కనీసం ఇద్దరి మధ్య మీటరుపైగా దూరం ఉండాలంటూ పలు సూచనలు చేసింది. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తిని […]

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఎమ్మెల్యే ఆ పనిచేశాడని.. పోలీసులు ఏం చేశారంటే..
Follow us on

కరోనా దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కొంటూ పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. గుంపులు గుంపులుగా ఉండరాదని.. కనీసం ఇద్దరి మధ్య మీటరుపైగా దూరం ఉండాలంటూ పలు సూచనలు చేసింది. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పుదుచ్చేరిలో లాక్ డౌన్ విధించినా.. పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ తన ఇంటి సేవా కార్యక్రమం చేపట్టారు. 200 మంది ప్రజలకు కూరగాయల సంచులను వితరణ చేశారు. అయితే ప్రజలు ఇంటికే పరిమితం కావాలని లాక్‌డౌన్ విధిస్తే.. సదరు ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమంతో ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చి.. కూరగాయల సంచులను తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని.. దీంతో ఎమ్మెల్యే జాన్ కుమార్‌పై పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు.