మూడోరోజు ప్యాకేజీలో ఇవే 11 అంశాలుః నిర్మ‌లా సీతారామ‌న్‌

ప్ర‌ధాని ప్ర‌క‌టించిన ప్యాకేజీపై కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మూడో రోజు మీడియా వేదిక‌గా వివ‌రాలు వెల్ల‌డించారు.

మూడోరోజు ప్యాకేజీలో ఇవే 11 అంశాలుః నిర్మ‌లా సీతారామ‌న్‌

Updated on: May 16, 2020 | 12:51 PM

దేశంలో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌తో ప్ర‌జ‌ల జీవ‌న విధానం, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. దీంతో దేశంలోని ప‌లు రంగాల‌కు ఆర్థిక భ‌రోసా క‌ల్పించేలా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించారు. ప్ర‌ధాని ప్ర‌క‌టించిన ప్యాకేజీపై కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ మూడో రోజు మీడియా వేదిక‌గా వివ‌రాలు వెల్ల‌డించారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

– రైతుల కోసం లక్ష కోట్లతో మౌలిక వసతుల కల్పన

– వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు స్వల్పకాలిక రుణాలు

– వ్యవసాయానికి కేటాయించిన నిధుల నుంచి గోడౌన్లు, కోల్డ్ స్టోరేజిల నిర్మాణం

-గ్రామీణ ఆహారోత్పత్తుల బ్రాండింగ్ కోసం ప్రత్యేక నిధి

-పశువుల్లో వ్యాధుల నియంత్రణకు రూ.13,343 కోట్లు

-పశువులు, గేదెలు, మేకలు, పందులు, గొర్రెలకు 100 శాతం వ్యాక్సినేషన్

-ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు రూ.20 వేల కోట్లు

-రొయ్యసాగు, చేపల వేటకు రూ.11 వేల కోట్లు

-ఫిషింగ్ హార్బర్లు, శీతల గిడ్డంగులకు రూ.9 వేల కోట్లు

-వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి ప్రణాళిక

-మత్స్య పరిశ్రమలో 55 లక్షల మందికి ఉపాధి

-లక్ష కోట్ల ఎగుమతులు లక్ష్యం

-చేపల వేటపై నిషేధం అమలులో ఉన్న సమయంలో వ్యక్తిగత బీమాతో పాటు పడవలకు సైతం బీమా